నా కొడుకుకి మాటిచ్చాను.. అతనికి విడాకులిచ్చే ప్రసక్తే లేదు.. పవిత్ర-నరేష్ పెళ్లి జరగనివ్వను
గతకొంత కాలంగా సీనియర్ నటుడు నరేష్-పవిత్రలు సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. న్యూఇయర్ సందర్భంగా వీరిద్ధరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది.
Ramya Ragupathi | గతకొంత కాలంగా సీనియర్ నటుడు నరేష్-పవిత్రలు సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. న్యూఇయర్ సందర్భంగా వీరిద్ధరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. కాగా తాజాగా నరేష్ భార్య, రమ్య రఘుపతి వీరిద్ధరి పెళ్లి వార్తలపై స్పందించింది. తమకు ఇంకా విడాకులు మంజూరు కాలేదని, ఆ వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉందని రమ్య తెలిపింది. నరేశ్‌కు విడాకులు ఇచ్చేందుకు తాను సిద్ధంగా లేనని చెప్పింది. నరేష్, పవిత్రను ఎలా పెళ్లి చేసుకుంటాడో చూస్తానని వార్నింగ్ ఇచ్చింది.
‘నరేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆయనతో పెళ్లికి మా ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. నా కుటుంబసభ్యులందరికీ నచ్చజెప్పి వివాహం చేసుకున్నాం. అత్తమ్మ (విజయనిర్మల) నన్ను ఒక రాణిలా చూసుకునేవారు. పెళ్లి అయ్యాక.. నరేశ్ గురించి నాకు ఎన్నో విషయాలు తెలిశాయి. ఆయనకి వేరేవాళ్లతో సంబంధాలు ఉన్నాయని తెలిసి బాధపడ్డా. ఈ విషయాలపైనే ఆయన నాకెన్నోసార్లు క్షమాపణలు చెప్పాడు. ఆయన మారతాడని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నా’ అని రమ్య రఘుపతి వెల్లడించింది.
‘ఇటీవల వాళ్లు షేర్ చేసిన వీడియో చూసి నాకు బాధగా అనిపించింది. సినిమా ప్రమోషన్ కోసం ఏమైనా చేశారా? అనే అనుమానం కూడా ఉంది. నన్ను ఇబ్బందిపెట్టడానికి వాళ్లిద్దరూ ఇలాంటి పనులు ఎన్నో చేశారు. వీళ్లు చేసే పనుల వల్ల నా పదేళ్ల కొడుకు కుంగుబాటుకు గురి అవుతున్నాడు. వాడికి మేమిద్దరం విడిపోవడం ఇష్టం లేదు. ‘నాన్నకు విడాకులు ఇవ్వొద్దు’ అని ఓసారి వాడు నా నుంచి మాట తీసుకున్నాడు. మేమిద్దరం కలిసే ఉంటామని వాడికి మాటిచ్చా. ఎంతకష్టమైనా నేను పోరాటం చేస్తా. నరేశ్‌తో కలిసి ఉండటానికి ప్రయత్నిస్తా. మా విడాకుల కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. నేను అయితే విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా లేను’ అని రమ్య స్పష్టం చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

