Drishyam 2: దృశ్యం 2 ఫస్ట్ లుక్‌కి ముహూర్తం ఫిక్స్..!

దాదాపు 8 యేళ్ల క్రితం విడుదలైన దృశ్యం చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా సీక్వెల్‌గా రూపొందిన దృశ్యం 2 చిత్రం కూడా అతి పెద్ద విజయం సాధించింది. మలయాళంలో హిట్ అయిన దృశ్యం 2ను తెలుగులో కూడా రీమేక్ చేశారు.
విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా తెరకెక్కుతున్న ‘దృశ్యం2’ మూవీకి జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ బాబు దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని “నారప్ప” కంటే ముందే విడుదల చేయాల్సి ఉంది. కాని పలు కారణాల వలన వాయిదా పడింది. దసరాకు చిత్రం విడుదల కానున్నట్టు తెలుస్తుండగా, ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్.
ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ని సెప్టెంబర్ 20న ఉదయం 10.08 గంటలకు విడుదల చేయనున్నామని పేర్కొన్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను డిస్నీ+హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. ఈ సినిమాను సురేష్ బాబు, ఆంటోనీ పెరుంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా నిర్మించారు.దృశ్యం 2 చిత్ర బృందం షూటింగ్‌ను కేవలం 47 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. వెంకటేష్, మీనా జంటగా నటించారు. నదియా కీలకపాత్రలో కనిపించనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

