Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
Ramayana | భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ: పార్ట్ 1’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది
Ramayana | భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ: పార్ట్ 1’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 20న ప్రారంభమైన ముందస్తు టికెట్ విక్రయాలు తొలి రోజే ఆకట్టుకునే స్థాయిలో సాగినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ‘రామాయణ: పార్ట్ 1’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన తొలి రోజే దేశవ్యాప్తంగా సుమారు రూ.5.35 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ సమయంలో సుమారు 91 వేల టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక విదేశాల్లోనూ ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ఓవర్సీస్ ప్రీ-సేల్స్ 1.3 మిలియన్ డాలర్ల మార్కును దాటినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
విడుదల తేదీ దగ్గరపడే కొద్దీ అడ్వాన్స్ బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇవి ముందస్తు టికెట్ విక్రయాలకు సంబంధించిన గణాంకాలు మాత్రమే. సినిమా విడుదలైన తర్వాత వసూళ్లు ఎలా ఉంటాయనేది ప్రేక్షకుల స్పందనపై ఆధారపడి ఉంటుంది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించనుండగా, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు. యశ్ రావణాసురుడి పాత్రను పోషిస్తున్నారు. వీరితో పాటు సన్నీ డియోల్, రవి దూబే, కాజల్ అగర్వాల్, అనుపమ్ ఖేర్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం.
‘దంగల్’ సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు నితేశ్ తివారీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారతీయ ఇతిహాసాన్ని భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కథనం, నటీనటుల పాత్రలు, విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ‘రామాయణ’ చిత్రానికి సంగీతం అందించే విషయంలోనూ ప్రత్యేకత ఉంది. హాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్తో పాటు ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. భారీ నిర్మాణ విలువలు, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో సినిమాను రూపొందిస్తున్నారు. నమిత్ మల్హోత్రాతో పాటు యశ్ కూడా నిర్మాణ బాధ్యతల్లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ద్వారా విడుదల చేయనున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1300 పాయింట్లకుపైగా జంప్..!
Siddhu 10 | సిద్ధు జొన్నలగడ్డ 10వ సినిమా ప్రారంభం.. సుకుమార్ రైటింగ్స్‌తో చేతులు కలిపిన స్టార్ బాయ్!
Kolkata-Sairang Express: ఎమర్జెన్సీ బ్రేక్స్ కోసం ఇంజిన్ డ్రైవర్ ప్రయత్నం.. అస్సాం రైలు ప్రమాదం వీడియో వైరల్
Satavahana University | కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం : వీడియో
Dada | ‘దాదా’లో సింగర్‌గా మారిన బాలయ్య.. ‘దాదా ధమాకా’లో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

