RamaRao On Duty | ‘బుల్బుల్ తరంగ్’ ప్రోమో విడుదల.. ఆకట్టుకుంటున్న రవితేజ స్టెప్స్
మాస్రాజ రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ తీరిక లేకుండా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేసే విధంగా రవితేజ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో
RamaRao On Duty | మాస్రాజ రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ తీరిక లేకుండా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేసే విధంగా రవితేజ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. గతనెల ‘ఖిలాడీ’తో భారీ ఫ్లాప్‌ను అందుకున్న మాస్రాజ ఈ సారి ‘రామారావు ఆన్ డ్యూటీ’తో ఎలాగైనా మంచి హిట్టు సాధించాలని కసితో ఉన్నాడు. శరత్ మండవ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇటీవలే స్పెయిన్‌లో రెండు పాటల చిత్రీకరణతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. అయితే తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.
బుల్ బుల్ తరంగ్.. బుల్ బుల్ తరంగ్ అంటూ సాగే ఈ పాటను సిద్ శ్రీ రామ్ ఆలపించగా రాకేందు మౌళి సాహిత్యం అందించాడు. సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ పాట, ఫుల్ లిరికల్ వీడియోను శ్రీరామనవమీ సందర్భంగా ఏప్రిల్10న విడుదల కానుంది. ఈ చిత్రంలో దివ్యాంశ కౌషిక్, రాజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. చాలా కాలం తర్వాత సీనియర్ నటుడు వేణు తోట్టెంపూడి ఈ చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. శ్రీ లక్ష్మివెంకటేశ్వరా సినిమాస్, ఆర్టి టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరితో కలిసి రవితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించబోతున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Here's #BulBulTarang Song Promo from #RamaRaoOnDuty ♥
Full Song tomorrow at 11:07 AM 🎧
‘MassMaharaja’ @RaviTeja_offl @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @SamCSmusic @sidsriram @RakenduMouliV @shobimaster @RTTeamWorks @LahariMusic pic.twitter.com/9y5lqPquv9
— RT Team Works (@RTTeamWorks) April 9, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

