Ramana Gogula | 18 ఏండ్ల తర్వాత వెంకటేశ్ కోసం పాట పాడిన రమణ గోగుల
Ramana Gogula | టాలీవుడ్ సింగర్, సీనియర్ సంగీత దర్శకుడు రమణ గోగుల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన మ్యూజిక్‌తో బద్రి, తమ్ముడు, లక్ష్మీ, ప్రేమంటే ఇదేరా, యోగి, జానీ సినిమాలకు సూపర్ హిట్లను అందించడమే కాకుండా తన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ పాటలను పాడాడు.
Ramana Gogula | టాలీవుడ్ సింగర్, సీనియర్ సంగీత దర్శకుడు రమణ గోగుల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన మ్యూజిక్‌తో బద్రి, తమ్ముడు, లక్ష్మీ, ప్రేమంటే ఇదేరా, యోగి, జానీ సినిమాలకు సూపర్ హిట్లను అందించడమే కాకుండా తన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ పాటలను పాడాడు. అయితే రమణ గోగుల, వెంకటేశ్‌ల సూపర్ కాంబో గురించి పరిచయం అవసరం లేదు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన ప్రేమంటే ఇదేరా, లక్ష్మీ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే 18 ఏండ్ల తర్వాత ఈ కాంబో రిపీట్ అవ్వబోతుంది. అవును వెంకటేశ్ కోసం పాట పాడాడు రమణ గోగుల.
విక్టరీ వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అయితే ఈ మూవీని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ను ప్రకటించింది. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే ఈ పాటను పాడింది రమణ గోగుల. అవును దీనికి సంబంధించిన ఒక వీడియోను పంచుకుంది చిత్రబృందం. ఫుల్ మాస్ బీట్తో ఉన్న ఈ సాంగ్ విడుదల అయిన తర్వాత సూపర్ హిట్ అవుతుందని మేకర్స్ తెలుపుతున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు.
Excited to have @RamanaGogula garu on board to sing for Victory @VenkyMama garu after 18 long years for our #SankranthikiVasthunam First Single 😍
It’s going to be a special song with #BheemsCeciroleo‘s terrific composition and @bhaskarabhatla garu’s amazing lyrics 👌👌
Coming… pic.twitter.com/roOY5tIiQy
— Anil Ravipudi (@AnilRavipudi) November 13, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

