కొత ్తకథలతో కమర్షియల్ సినిమాలు నిర్మిస్తాను
‘రాజా విక్రమార్క’ చిత్రంతో నిర్మాతగా పది సినిమాలు తీసిన అనుభవం వచ్చింది. నిర్మాతగా మూవీ మొఘల్ స్వర్గీయ డా॥ డి.రామానాయుడు నాకు ఆదర్శం. ఆయనలా అంకితభావంతో సినిమాలు నిర్మించాలనేది నా కోరిక’ అన్నారు నిర్మాత 88 రామారెడ్డి. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘రాజా విక్రమార్క’. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. కాగా నేడు ‘88 రామారెడ్డి జన్మదినం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ నిర్మాతగా నాకిది తొలిచిత్రం.
ప్రతి రోజు సెట్స్‌కు వెళ్లి దగ్గరుండి నిర్మాణ పనులు చూసుకున్నాను. ‘రాజా విక్రమార్క’ యాక్షన్ ఎంటర్టైనర్. హీరో కార్తికేయ ఎన్ఐఏ అధికారిగా కనిపిస్తారు. కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా చిత్రం రూపొందుతోంది. హీరో కెరీర్లో ‘ఆర్ఎక్స్ 100‘కు మించి ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. కొత్త కథలతో జనాదరణ పొందే సినిమాలు నిర్మించాలనే లక్ష్యంతో సినీ పరిశ్రమకు వచ్చాను. ఈ సినిమా తరువాత నిర్మించబోయే రెండు చిత్రాలు చర్చల దశలో వున్నాయి. త్వరలోనే వాటి వివరాలు తెలియజేస్తాను’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!


