రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవ దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి అవినీతిపై సాగించే సమరమే చిత్ర కథాంశం. జూన్ 17న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సినిమాలోని సెకండ్ లిరికల్ వీడియో ‘సొట్టల బుగ్గల్లో..’ శనివారం విడుదలైంది. రొమాంటిక్ మెలోడీగా తెరకెక్కిన ఈ గీతంలో రవితేజ, కథానాయిక దివ్యాంశకౌశిక్ కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. సామ్ సీఎస్ స్వరపరచిన ఈ పాటకు కల్యాణ్‌చక్రవర్తి సాహిత్యాన్ని అందించారు. హరిప్రియ, నకుల్ అభ్యంకర్ ఆలపించారు. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్, సంగీతం: సామ్ సీఎస్, నిర్మాణ సంస్థలు: ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీం వర్క్స్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ.