రామరాజు, సోనాక్షీ వర్మ, అభి, ప్రీతి సింగ్ శ్రీకృష్ణ, డాక్టర్ మారుతి సకారం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఎట్ లవ్’. టీఎంఎస్ బ్యానర్, ప్రీతమ్ ఆర్ట్స్, ఎస్ఎన్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహేందర్ సింగ్, శైలజ తాటిచర్ల, శ్రీ నారాయణ నిర్మాతలు.
శ్రీ నారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టైటిల్ లోగోను ఇటీవల దర్శకుడు నాగ్ అశ్విన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ నారాయణ మాట్లాడుతూ…‘గిరిజన నేపథ్యంతో స్వచ్ఛమైన ప్రేమ కథగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. మనసుకు హత్తుకునే భావోద్వేగాలుంటాయి. అటవీ ప్రాంతంలో షూటింగ్ జరుగుతున్నది. మహిళలకు సంబంధించిన మంచి సందేశాన్ని చెప్పబోతున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మహేందర్, సంగీతం : సన్నీ మానిక్, రామ్ చరణ్.