ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో తెగ సందడి చేస్తుంటారు అక్షయ్ కుయార్.ఈ మధ్య కరోనా వలన కాస్త స్లో అయ్యారు. అప్పటికీ ఆయన చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం అక్షయ్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో రామసేతు ఒకటి. ఈ మూవీలో అక్షయ్ పురావస్తు శాస్త్రవేత్తగా కనిపిస్తారు. ఇదే సినిమాల్లో విభిన్నమైన కథాంశాల్లో మూవీలు చేసే తెలుగు హీరో సత్యదేవ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.
అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సంబంధించిన షెడ్యూల్ గత కొద్ది రోజులుగా ఊటీలో సాగుతోంది. తాజాగా షెడ్యూల్ ముగిసినట్టు మేకర్స్ ప్రకటించారు.అక్షయ్ ఒక ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులో తాను.. జాక్వెలిన్ తో పాటు సత్యదేవ్ ఉన్న ఫోటోను పోస్టు చేసి.. ఫోటోలో లేదా జీవితంలోచీకటి మేఘాలపై ఎప్పుడూ అందమైన కాంతి రేఖ ఉంటుంది అని పేర్కొన్నారు.ఇందులో అక్షయ్ స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తుండగా, పోస్టర్ ఆకట్టుటకుంటుంది.