The Warriorr | ‘ది వారియర్’ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన రామ్ పోతినేని
The Warriorr Promotions | రామ్ పోతినేని హీరోగా ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘ది వారియర్’. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ యాక్షన్ సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. కాగా ఈ సారి కొంచెం స్టైలిష్‌గా ఖాకి యూనిఫార్మ్ వేసుకుని విలన్లను చిత్తు చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై విపరీతమైన అంచనాలను క్రియేట్ చేశాయి. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం జూలై 14న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్లను స్టార్ట్ చేశారు.
తాజాగా రామ్ ‘ది వారియర్’ ప్రమోషన్లను స్టార్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశాడు. ఈ ఫోటోస్‌లో రామ్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మెరిసిపోతున్నాడు. కాగా కృతిశెట్టి కూడా రామ్‌తో కలిసి ప్రమోషన్లు చేస్తుంది. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన అన్ని పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఈ చిత్రంతో డీఎస్పీ కంబ్యాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి ఈ సినిమాను నిర్మించాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనే ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమాతో రామ్ తిమిళ డెబ్యూ ఇవ్వనున్నాడు.
#TheWarriorr promotions. pic.twitter.com/nHGjyMmmCQ
— RAm POthineni (@ramsayz) July 8, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

