జిమ్లో వ్యాయామం చేస్తూ హీరో రామ్ గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. మెడకు స్వల్పంగా గాయమైందని ఆయన తెలిపారు. తగినంత విశ్రాంతి తీసుకొని త్వరగా కోలుకోవాలని రామ్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో రామ్ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. భారీ యాక్షన్ హంగులతో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి కథానాయికగా నటిస్తున్నది.