Andhra King Taluka Teaser | రామ్ పోతినేని ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీజర్ విడుదల!
Andhra King Taluka | టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా దర్శకుడు పి. మహేష్ బాబు (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ 'ఆంధ్రా కింగ్ తాలూకా'.
Ram Pothineni | టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా దర్శకుడు పి. మహేష్ బాబు (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే ఈ చిత్రంలో రామ్.. ఒక సూపర్ స్టార్‌కి వీరాభిమానిగా కనిపించనున్నారు. కన్నడ స్టార్ ఉపేంద్ర గారు పోషించిన ‘ఆంధ్రా కింగ్’ పాత్రకు రామ్ ఎంతటి డైహార్డ్ ఫ్యాన్ అనే అంశాన్ని టీజర్ హైలైట్ చేసింది. రామ్ పోతినేని ఎనర్జీ, మాస్ డైలాగ్స్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా, ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ వంటి ప్రముఖ నటులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

