Ram | వరుస ఫ్లాప్స్ తర్వాత రామ్ కొత్త ప్రయోగం… లోకేష్ స్కూల్ డైరెక్టర్‌తో సెన్సేషనల్ ప్రాజెక్ట్
Ram | టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస పరాజయాలతో సతమతమవుతున్నప్పటికీ, మళ్లీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని గట్టి నిర్ణయంతో ముందుకెళ్తున్నారు. ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన ‘డబుల్ ఇస్మార్ట్’, ‘ఆంధ్ర కింగ్’ వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, తన తదుపరి సినిమాల విషయంలో రామ్ మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.
Ram | టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస పరాజయాలతో సతమతమవుతున్నప్పటికీ, మళ్లీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని గట్టి నిర్ణయంతో ముందుకెళ్తున్నారు. ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన ‘డబుల్ ఇస్మార్ట్’, ‘ఆంధ్ర కింగ్’ వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, తన తదుపరి సినిమాల విషయంలో రామ్ మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా, కొత్తదనం ఉన్న కథలను ఎంపిక చేసుకుంటూ సక్సెస్ ట్రాక్‌లోకి తిరిగి రావాలని రామ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
విశేషమేమిటంటే, ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ వద్ద శిష్యరికం చేసిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తెరకెక్కించబోతున్నాడని సమాచారం. లోకేష్ సినిమాలకు ప్రత్యేకమైన ఇంటెన్సిటీ, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఎలా ఉంటాయో తెలిసిందే. అదే స్టైల్లో ఈ సినిమా కూడా పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం ద్వారా రామ్‌ను పూర్తిగా కొత్త కోణంలో చూపించేందుకు దర్శకుడు ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌కు మరో పెద్ద ప్లస్ పాయింట్ మ్యూజిక్. ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారని సమాచారం. అనిరుధ్ అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాకు ప్రత్యేక హైప్ తీసుకురావడం ఖాయం. రామ్ ఎనర్జీకి అనిరుధ్ మ్యూజిక్ జతకలిస్తే థియేటర్లలో మంచి స్పందన రావడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ రామ్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలవొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మొత్తానికి, వరుస ఫ్లాప్స్ తర్వాత రామ్ తీసుకుంటున్న ఈ కొత్త నిర్ణయం ఆయన కెరీర్‌కు ఎంతవరకు మలుపుతిప్పుతుందో చూడాలి. కొత్త దర్శకుడి విజన్, అనిరుధ్ సంగీతం కలిసి రామ్‌కు మళ్లీ సక్సెస్ అందిస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ.. మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
Insurance Scam | శవాల మీది పేలాల మేత.. కార్మిక శాఖలో 150 కోట్ల స్కామ్
Revanth Reddy | చదువును వ్యాపారం చేయొద్దని అప్పుడు ఉపన్యాసాలు.. ఇప్పుడు కూతురితోనే కార్పొరేట్ స్కూల్.. సీఎం రేవంత్ తీరుపై క్రిశాంక్ ఫైర్
Revanth Reddy | సీఎం దోచి పారేస్తున్నడు.. దొరికింది దొరికినట్టు దిగమింగుతున్నడు.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Horoscope | 13-10-2026 మంగళవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

