‘సినిమా రిలీజ్ టైం దగ్గరకు రాగానే కొన్ని మల్టీఫ్లెక్స్ థియేటర్ వాళ్లు స్క్రీనింగ్ చేయమని చెప్పడం బాధపెట్టింది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఆ సినిమా విషయంలో నన్ను అడ్డుకోవడం బ్రహ్మతరం కాదు’ అన్నారు రామ్‌గోపాల్‌వర్మ. ఆయన దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇష్టం’. అప్సరరాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్ని పోషించారు. త్వరలో విడుదలకానుంది.
బుధవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ ‘ఇద్దరమ్మాయిల ప్రేమకథ ఇది. సమాజంలో ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుంటే ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు? అందరూ సమానమే కదా? అనే ఆలోచనతో ఈ సినిమా చేశా’ అని చెప్పారు. తెలుగు రాష్ర్టాల్లో 180 థియేటర్లలో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్‌గోపాల్‌వర్మపై గీత రచయిత ప్రవీణ్ రచించిన ‘ఇంటెలిజెంట్ ఇడియట్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.