Ram Gopal Varma | చెక్‌బౌన్స్ కేసుపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ
RGV Check Bounce | వివాదాస్పద దర్శకుడిగా పేరుపొందిన రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)కు బిగ్ షాక్ తగిలింది. ఆరేళ్ల కిందటి కేసులో ముంబైలోని అంథేరీ మెజిస్ట్రేట్ కోర్టు (Andheri Magistrate court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆయన్ని దోషిగా తేలుస్తూ.. మూడు నెలల జైలు శిక్ష విధించింది.
Ram Gopal Varma | చెక్‌బౌన్స్ కేసు (cheque bounce case)లో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబయి అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించడంతో పాటు వర్మపై నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే.
2018లో రాంగోపాల్ వర్మపై చెక్‌బౌన్స్ కేసు నమోదు అవ్వగా.. మహేష్‌చంద్ర మిశ్రా (Mahesh Chandra Mishra) అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతుండగా.. వర్మ ఒక్కసారి కూడూ కోర్టుకు హాజరుకావడం లేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ (non bailable warrant issued) చేసింది. రాబోయే మూడు నెలల్లో ఫిర్యాదు దారుడికి రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. లేదంటే మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ తీర్పు వెల్లడించింది.
అయితే ఈ కేసుకు సంబంధించి ట్విట్టర్ వేదికగా స్పందించారు వర్మ. నా మీద అంధేరి కోర్టు విధించిన శిక్షకు సంబంధించి నేను క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను.. ఇది 7 ఏండ్ల క్రితం నాటి విషయం. నా మాజీ ఉద్యోగితో ₹ 2.38 లక్షల వివాదానికి సంబంధించినది. నా న్యాయవాదులు ఈ ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నారు. కేసు ప్రస్తుతం కోర్టులో ఉన్నందున దీని గురించి ఇంతకంటే ఏం చెప్పలేను అంటూ ఆర్జీవీ రాసుకోచ్చాడు.
With regard to the news about me and Andheri court, I want to clarify that it is to do with a 7 year old case of Rs 2 lakh 38 thousand amount , relating to my ex-employee .. My advocates are attending to it. and since the matter is in court i cannot say anything further
— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

