Peddi Movie Trailer | మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’ (PEDDI) నుండి చిత్ర యూనిట్ తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ను పంచుకుంది. ఈ సినిమా గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మే 18న ముంబైలో జరగనున్న నేపథ్యంలో, అంతకంటే ముందే అభిమానుల్లో జోష్ నింపేలా ఒక సరికొత్త క్యారెక్టర్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు ఒక కీలకమైన పాత్రను పోషిస్తుండగా, ఆయనకు సంబంధించిన ‘అప్పలసూరి’ (Appalasoori) అనే ఇంటెన్స్ క్యారెక్టర్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. “రూటెడ్ ఇన్ ఎమోషన్.. డ్రివెన్ బై పర్పస్” అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ గ్లింప్స్‌లో జగపతి బాబు లుక్ చాలా రస్టిక్ అండ్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తూ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
మే 18 నుండి ‘పెద్ది’ ట్రైలర్ టేకోవర్ హంగామా అధికారికంగా షురూ కానుండటంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. వృద్ధి సినిమాస్ మరియు మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి చికిరి’, ‘రాయ్ రాయ్ రా రా’ అనే సాంగ్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడు వచ్చిన ‘అప్పలసూరి’ గ్లింప్స్ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 4, 2026 న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.