Ram Charan | మెగా అభిమానులకు ఫాదర్స్ డే సందర్భంగా ఓ ప్రత్యేక క్షణం ఆవిష్కృతమైంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మెగా 158’ షూటింగ్ సెట్స్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సడెన్‌గా ప్రత్యక్షమై తన తండ్రికి సర్ప్రైజ్ ఇచ్చారు. తండ్రీకొడుకుల మధ్య చోటుచేసుకున్న ఈ ఆప్యాయ క్షణాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో చిరంజీవి తన 158వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ నేరుగా షూటింగ్ స్పాట్‌కు చేరుకుని తన తండ్రితో కొంత సమయం గడిపారు. చిరంజీవిని సర్ప్రైజ్ చేస్తూ సెట్స్‌లోకి వచ్చిన చరణ్‌ను చూసి చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఆనందానికి గురయ్యారు. తండ్రీకొడుకులు కాసేపు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ గడపడం అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది.
ఈ ప్రత్యేక క్షణాలను దర్శకుడు బాబీ కొల్లి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్‌తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ఆయన ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. మెగా 158 సెట్స్‌లో అందమైన ఫాదర్స్ డే మూమెంట్‌ను చూడడం చాలా ఆనందంగా ఉంది. రామ్ చరణ్ సెట్స్‌కు వచ్చి తన తండ్రితో సమయం గడిపారు. ఎంత పెద్ద స్టార్ అయినా కుటుంబంపై ఉన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు అని బాబీ పేర్కొన్నారు.సాధారణంగా చిరంజీవి, రామ్ చరణ్ కలిసి కనిపిస్తే వారి ఫొటోలు క్షణాల్లో వైరల్ అవుతాయి. అయితే ఈసారి దర్శకుడు బాబీ కేవలం రామ్ చరణ్‌తో ఉన్న ఫొటోలను మాత్రమే షేర్ చేయడం ఆసక్తిని పెంచుతోంది.దీంతో మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్‌ను చిత్రబృందం ఇప్పటివరకు గోప్యంగా ఉంచుతోందనే చర్చ మొదలైంది.
ఇటీవల జరిగిన ఒక బర్త్‌డే సెలబ్రేషన్ ఫొటోల్లో కూడా చిరంజీవి కనిపించకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. గతంలో చిరంజీవి-బాబీ కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మళ్లీ అదే కాంబినేషన్లో వస్తోన్న ‘మెగా 158’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి మరోసారి తన స్టైల్, ఎనర్జీతో అభిమానులను అలరించనున్నట్లు సమాచారం. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
Had the joy of witnessing a beautiful Father’s Day moment on the sets of #Mega158. ✨
Mega Powerstar @AlwaysRamCharan garu dropped by the sets of #ChiruBobby2 to spend time with his father, Megastar @KChiruTweets garu
No matter how big the star, the values, humility, and love… pic.twitter.com/IX28Id915v
— Bobby (@dirbobby) June 21, 2026