రామ్‌చరణ్ సినిమా కోసం టాలెంట్ హంట్
‘ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్‌స్టార్‌గా అవతరించారు రామ్‌చరణ్. ‘ఉప్పెన’తో బ్లాక్బాస్టర్ డైరెక్టర్‌గా కితాబులందుకున్నారు బుచ్చిబాబు సాన. వీరిద్దరి కలయికలో సినిమా అనగానే షూటింగ్ మొదలుకాకుండానే అంచనాలు ఆకాశాన్ని అంటాయి.
‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్‌స్టార్‌గా అవతరించారు రామ్‌చరణ్. ‘ఉప్పెన’తో బ్లాక్బాస్టర్ డైరెక్టర్‌గా కితాబులందుకున్నారు బుచ్చిబాబు సాన. వీరిద్దరి కలయికలో సినిమా అనగానే షూటింగ్ మొదలుకాకుండానే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఉత్తరాంధ్రలో జరిగే క్రీడా నేపథ్య కథ అని తెలిసినప్పట్నుంచీ సగటు ప్రేక్షకుడికి ఈ సినిమాపై ఆసక్తి రెట్టింపు అయ్యింది.
‘ఆర్సీ 16’అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ సమర్పిస్తున్నది. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలపై వెంకటసతీశ్ కిలారు అత్యంత భారీ వ్యయంతో నిర్మించనున్నారు. యూనివర్సల్ అప్పీల్ ఉండే పవర్ఫుల్ స్క్రిప్ట్‌ని బుచ్చిబాబు సిద్ధం చేశారని యూనిట్ సభ్యులు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.
ఉత్తరాంధ్ర ప్రాంత కథ కావడంతో, ఆ ప్రాంతానికి చెందిన ఔత్సాహిక నటీనటుల అవసరం ఈ సినిమాకు ఉంది. అందుకే.. ఉత్తరాంధ్ర భాష అనర్గళంగా మాట్లాడగల నటీనటులకోసం ‘ఆర్సీ16’ టీమ్ టాలెంట్ హంట్ నిర్వహించనుంది. ఈ నెలలోనే టాలెంట్ హంట్ నిర్వహిస్తామని, విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ ఆడిషన్స్ నిర్వహిస్తామని చిత్రబృందం తెలిపింది. ఏఆర్ రెహమాన్ స్వరాలందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

