Game Changer | గేమ్ చేంజర్ నుంచి మూడో పాట వచ్చేస్తోంది..
ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్' ముందు వరుసలో ఉంటుంది. దాదాపు మూడేళ్లు నిర్మాణం జరుపుకున్న ఈ భారీ పానిండియా చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’ ముందు వరుసలో ఉంటుంది. దాదాపు మూడేళ్లు నిర్మాణం జరుపుకున్న ఈ భారీ పానిండియా చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ వెర్షన్‌ని ఆదిత్యరామ్ మూవీస్ సంస్థలు విడుదల చేస్తుండగా, హిందీలో ఏఏ ఫిల్మ్స్ అనిల్ తడానీ రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు శంకర్ ఈ సినిమాకు తుదిమెరుగులు దిద్దుతున్నారు.
ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్ ఇప్పటికే మొదలైన విషయం తెలిసిందే. థమన్ సంగీత దర్శకత్వంలో ఇప్పటికే విడుదలైన రెండు పాటలూ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఈ నెల 28న మూడో పాటను మేకర్స్ విడుదల చేయనున్నారు. న్యూజిలాండ్‌లో రామ్‌చరణ్, కియారా అద్వానీలపై చిత్రీకరించిన ఈ మెలోడీ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
ఈ సందర్భంగా ఈ పాటకు సంబంధించిన పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో రామ్‌చరణ్, కియారా అద్వానీ కూల్‌గా కనిపిస్తున్నారు. డిసెంబర్ 21న అమెరికాలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. అంజలి మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ: కార్తీక్ సుబ్బరాజు, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: ఎస్.తిరుణ్ణావుక్కరసు, సహనిర్మాత: హర్షిత్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dakshinamukhi anjaneya swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

