Ram Charan 16 | ‘ఆర్సీ16’లో రామ్ చరణ్‌కు జోడిగా జాన్వీ కపూర్?
Ram Charan 16 | బాలీవుడ్ కథానాయిక జాన్వీకపూర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దివంగత అందాల తార శ్రీదేవి గారాలపట్టిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక జాన్వీ ప్రస్తుతం ‘దేవర’లో ఎన్టీఆర్ జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే.
Ram Charan 16 | బాలీవుడ్ కథానాయిక జాన్వీకపూర్ (Janhvi kapoor) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దివంగత అందాల తార శ్రీదేవి గారాలపట్టిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక జాన్వీ ప్రస్తుతం ‘దేవర’లో ఎన్టీఆర్ జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్లో ఉండగానే జాన్వీ కపూర్ మరో తెలుగు సినిమాకు ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.
ఉప్పెన సినిమాతో తొలి చిత్రంతోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరాడు టాలీవుడ్ దర్శకుడు బుచ్చి బాబు సనా. అయితే ఈ సినిమా అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)తో బుచ్చి బాబు సనా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఆర్సీ16’ వర్కింగ్ టైటిల్‌గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ కలసి ఈ ప్రాజెక్టును నిర్మించనున్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియాగా పలు భాషల్లో రూపొందనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ తీసుకోనున్నట్లు సమాచారం. ఇదే విషయంపై జాన్వీని సంప్రదించగా.. జాన్వీ కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

