Rakul preet singh Wedding | రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి డేట్ ఫిక్స్.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డు
Rakul preet singh Wedding | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul preet singh) త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీని రకుల్ ఈ నెల 21న గోవాలో పెళ్లి చేసుకోబోతుంది. ఈ క్రమంలో వీరి పెళ్లికి సంబంధించిన అఫీషియల్ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Rakul preet singh Wedding | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul preet singh) త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీని రకుల్ ఈ నెల 21న గోవాలో పెళ్లి చేసుకోబోతుంది. ఈ క్రమంలో వీరి పెళ్లికి సంబంధించిన అఫీషియల్ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిబ్రవరి 21న గోవాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో ఈ పెళ్లి జరుగబోతున్నట్లు ఈ కార్డులో ఉంది. ఇక కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో రకుల్ పెళ్లి గ్రాండ్‌గా జరుగనుంది. అయితే ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి మంచు లక్ష్మితో పాటు ప్రగ్యా జైస్వాల్, సీరత్ కపూర్ తదితరులు హాజరుకానున్నట్లు సమాచారం.
బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానీతో తాను రిలేషన్లో ఉన్నానంటూ రకుల్ ప్రీత్ సింగ్ 2021లో ప్రకటించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. ఫిబ్రవరి 21న ఒక్కటి కాబోతున్నారు. ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం హిందీలో మేరీ పత్నీ కా రీమేక్‌లో నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు తమిళంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తోంది. రకుల్ తెలుగులో చివరగా 2021లో వచ్చిన కొండపొలంలో నటించింది.

Rakul preet singh Wedding Card
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

