Rakul Preet Singh | నాలుగేండ్లు ఆ మాటే మరిచిపోయా.. అందుకే అలా ఫిక్సయ్యానంటున్న రకుల్
Rakul Preet Singh | టాలీవుడ్ టు బాలీవుడ్ తళతళ మెరుస్తున్న తారక రకుల్ ప్రీత్ సింగ్. షూటింగ్ కోసం తరచూ విదేశాలకు వెళ్లడం తప్ప, ప్రత్యేకించి విహారానికి బయల్దేరడం తక్కువే అంటున్నదీ ముద్దుగుమ్మ. వెకేషన్కువెళ్తే మాత్రం.. బోలెడంత ఎంజాయ్ చేస్తుందట. కడలిని తలుచుకోగానే బడలిక తీరుతుందట.
Rakul Preet Singh | టాలీవుడ్ టు బాలీవుడ్ తళతళ మెరుస్తున్న తారక రకుల్ ప్రీత్ సింగ్. షూటింగ్ కోసం తరచూ విదేశాలకు వెళ్లడం తప్ప, ప్రత్యేకించి విహారానికి బయల్దేరడం తక్కువే అంటున్నదీ ముద్దుగుమ్మ. వెకేషన్కువెళ్తే మాత్రం.. బోలెడంత ఎంజాయ్ చేస్తుందట. కడలిని తలుచుకోగానే బడలిక తీరుతుందట. రకుల్ ట్రావెల్ హాబీస్ ఆమె మాటల్లోనే..
గడిచిన నాలుగేండ్లుగా వెకేషన్ అనే మాటే మర్చిపోయాను. బిజీ షెడ్యూల్స్‌తో షూటింగ్ జరిగే ప్రదేశాలే విహార కేంద్రాలుగా భావించే పరిస్థితి వచ్చేసింది.
షూటింగ్స్‌లో భాగంగా దేశదేశాలూ తిరుగుతున్నా.. అక్కడి వింతలు, విశేషాలు తెలుసుకునే వీలు ఎక్కడుంటుంది? అందుకే, అడపాదడపా రెండు రోజులైనా చిన్నచిన్న పర్యటనలు చేద్దామని ఫిక్సయ్యా. ఇటీవల స్కాట్లాండ్ వెళ్లొచ్చాను. చాలా రిలాక్స్డ్గా ఫీలయ్యాను.
నాకు నీళ్లంటే ప్రాణం. విహారానికి వెళ్తే సముద్ర తీరాలే నా మొదటి ప్రాధాన్యం. కెరటాలతో సయ్యాటలు ఆడొచ్చు. సముద్రంలో స్కూబా డైవింగ్, స్నోర్కెలింగ్, జెట్ స్కీయింగ్ వంటి సాహసాలు చేయడం అంటే సరదా! ఇష్టమైన ప్రదేశానికి వెళ్లినప్పుడే కదా.. మన మనసుకు నచ్చినట్టుగా ఉండగలుగుతాం.
సాధారణంగా వానల్లో విహారం చాలామందికి నచ్చదు. నేనూ అదే టైప్! ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్లినప్పుడు పొలోమని వానపడితే ఏం ఎంజాయ్ చేస్తం చెప్పండి? కాకపోతే, వానల్లో గోవా సముద్ర తీరానికి వెళ్లడానికి ఇష్టపడతా. చిరుజల్లుల వేళ లోనావాలా-ముంబై జర్నీ బావుంటుంది.
ఇప్పటి వరకూ నేను వెళ్లిన విహార కేంద్రాల్లో ఫిన్లాండ్ చాలా నచ్చింది. అక్కడి ప్రకృతి రమణీయత నన్ను కట్టిపడేసింది. ఆకాశం నుంచి భూమికి దిగివచ్చినట్టుండే కాంతిపుంజాలను అలా చూస్తూ ఉండిపోయాను. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో గడ్డకట్టిన జలపాతాలను చూసినప్పుడు థ్రిల్ అనిపించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

