Operation RAAVAN | ‘పలాస 1978’ ఫేం రక్షిత్ (Rakshit Atluri) హీరోగా నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి ఆపరేషన్ రావణ్ (Operation RAAVAN). ఇటీవలే విడుదల చేసిన మూవీ లుక్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. మేకర్స్ ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం తాజాగా ఆపరేషన్ రావణ్ గ్లింప్స్ వీడియోను లాంఛ్ చేశారు. ఇంటెన్సివ్‌గా, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగే స్టోరీతో సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్.
మీ ఆలోచనలే మీ శత్రువులు.. అనే ట్యాగ్‌లైన్‌తో హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ థ్రిల్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలో మలయాళ భామ సంగీర్తన విపిన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. పలాస తర్వాత సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్ రఘు కుంచె మరోసారి కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది.
రక్షిత్ మరోవైపు రొమాంటిక్ ఎంటర్టైనర్ శశివదనే (Sasivadane)తోపాటు నరకాసుర సినిమాలో కూడా నటిస్తున్నాడని తెలిసిందే. శశివదనే మూవీలో కోమలీ ప్రసాద్ (Komalee Prasad) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సాయి మోహన్ ఉబ్బన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఆపరేషన్ రావణ్ టీజర్
Here’s the Intensive & Pulse-pounding, Thrill packed #OperationRaavan ‘FIRST THRILL’ 👺🔥
GLIMPSE OUT NOW 👇https://t.co/OOxzIqYr7U @Rakshitatluri @sangeerthanaluv #Venkatasatya @DhyanAtluri @SripalCholleti @sarva_vasudevan @SudhasMedia pic.twitter.com/ruGjrfCiFM
— SUDHAS MEDIA (@sudhasmedia) May 30, 2023