Aamir Khan Marriage | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ మూడో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వాస్తున్నాయి. ఏడాది కిందట వచ్చిన లాల్ సింగ్ చద్దా ఘోర పరాజయం సాధించడంతో అమీర్ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. సాలిడ్ కథతో మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇదిల ఉంటే అమీర్ తాజాగా మూడో పెళ్లికి రెడీ అవుతున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. కెరీర్ బిగెనింగ్‌లో రీనా దత్తాను పెళ్లి చేసుకున్న అమీర్.. ఇద్దరు పిల్లలు పుట్టాక కొంత కాలానికే విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అయిన కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆమెతోనూ విభేదాలు ఇటీవలే విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం అమీర్ సింగిల్ లైఫ్‌ను లీడ్ చేస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే అమీర్ గతకొంత కాలంగా దంగల్ నటి ఫాతిమా సన షేక్‌తో గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిపై అమీర్ స్పందించక పోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది. అంతేకాకుండా కిరణ్‌రావుతో విభేదాలు రావడానికి కారణం కూడా ఫాతిమానే అని బాలీవుడ్ మీడియా బల్ల గుద్ది మరీ చెప్పింది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ అమీర్ మూడో పెళ్లికి సంబంధించిన చర్చలు మాత్రం అప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి. ఇక తాజాగా ఈ వార్తలే నిజమయ్యేలానే అనిపిస్తున్నాయి.
రీసెంట్గా వీరిద్దరూ కలిసి ఉన్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అయింది. ఐదు రోజుల క్రితం ముంబైలో వీరిద్దరూ కలిసి పికిల్ బాల్ ఆడారు. ఈ వీడియో వైరల్ కావడంతో మళ్లీ అమీర్ పెళ్లి వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. దీనికి తోడు తాజాగా రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు పెళ్లి వార్తలపై మరింత ఆజ్యం పోశాయి. లేటెస్ట్గా జరిగిన ఐఫా వేడుకల్లో బీటౌన్‌లో ముగ్గురు హాట్టెస్ట్ యాక్టర్స్ ఎవరు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రాఖీ సావంత్.. షారుఖ్, సల్మాన్.. మూడో వ్యక్తి మూడో పెళ్లి చేసుకోబోతున్న అమీర్ అయి ఉండొచ్చని చెప్పింది. ఆ తర్వాత తన స్టేట్మెంట్ను ఉద్దేశిస్తూ సారీ అమీర్.. ఐ లవ్ యూ అని చెప్పింది. ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అవడంతో అమీర్ త్వరలోనే మూడో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా అమీర్ కంటే ఫాతిమా 26ఏళ్లు చిన్నది.