Rakasa | టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘రాకాస’ ప్రభంజనం సృష్టిస్తోంది!. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా, సంగీత్ శోభన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సమ్మర్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 15.80 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.
దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన ఈ హారర్ కామెడీ ఫాంటసీ డ్రామా ఏప్రిల్ 3న గ్రాండ్‌గా విడుదలై మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కేవలం రెండు రోజుల్లోనే 10.30 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, ఆదివారం నాటి వసూళ్లతో కలిపి సరిగ్గా మూడు రోజుల్లో 15.80 కోట్ల మార్కును దాటి రికార్డు సృష్టించింది. విడుదలైన తొలి 24 గంటల్లోనే 60 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
కమిటీ కుర్రోళ్లు వంటి సక్సెస్ తర్వాత నిహారిక కొణిదెల, జీ స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూనే ఉత్కంఠకు గురిచేస్తోంది. సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్, నయన్ సారిక గ్లామర్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ వంటి హేమాహేమీల నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ ఈ చిత్రానికి భారీ ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం అన్ని ప్రధాన థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ ఫన్టాస్టిక్ సమ్మర్ బ్లాక్ బస్టర్ మ్యాజిక్‌ను అనుభవించేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.