‘రాకాస’ వినోదం కలబోసిన ఫాంటసీ అడ్వెంచర్ చిత్రమని, రెండున్నర గంటలు ప్రేక్షకుల్ని నాన్‌స్టాప్‌గా నవ్విస్తుందని అన్నారు చిత్ర హీరో సంగీత్ శోభన్. మానసశర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకురానుంది. పింక్ ఎలిఫెంట్ పతాకంపై నిహారిక కొణిదెల నిర్మించారు. బుధవారం ఏపీలోని మదనపల్లెలో ట్రైలర్‌ను విడుదల చేశారు. బ్రహ్మరాక్షసుడి కోట చుట్టూ జరిగే సంఘటనలతో ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠను పంచింది.
ట్రైలర్లో కంటే తెరపై వందరెట్ల వినోదాన్ని చూస్తారని, తన సినిమాల్లో ఎలాంటి సందేశాలు ఉండవని, కేవలం వినోదం మాత్రమే ఉంటుందని, ప్రేక్షకుల్ని నవ్వించడమే లక్ష్యంగా ఈ సినిమా తీశామని హీరో సంగీత్శోభన్ తెలిపారు. ఈ వేసవిలో ఫ్యామిలీస్ అంతా కలసి చూసే వినోదాత్మక చిత్రమిదని నిహారిక కొణిదెల పేర్కొన్నది. నయన్సారిక, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్‌దేవ్, నిర్మాతలు: నిహారిక కొణిదెల, ఉమేష్‌కుమార్ బన్సాల్, రచన-దర్శకత్వం: మానసశర్మ.