Rakasa | ‘రాకాస’ బాక్సాఫీస్ దూకుడు.. రెండు రోజుల్లోనే 10 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్!
Rakasa | ఇటీవల విడుదలైన రాకాస చిత్రం రిలీజ్‌కు ముందే యూత్ ఆడియన్స్‌లో భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. ఆ క్రేజ్‌కు తగ్గట్టుగానే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ నమోదు చేస్తూ ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘రాకాస’ మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.6 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
Rakasa | ఇటీవల విడుదలైన రాకాస చిత్రం రిలీజ్‌కు ముందే యూత్ ఆడియన్స్‌లో భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. ఆ క్రేజ్‌కు తగ్గట్టుగానే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ నమోదు చేస్తూ ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘రాకాస’ మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.6 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రం యూత్ ఆడియన్స్‌లో మంచి హైప్ సృష్టించడంతో మొదటి రోజు నుంచే థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. షేర్ పరంగా చూస్తే, ఫస్ట్ డే వరల్డ్‌వైడ్‌గా రూ.2.51 కోట్ల షేర్ నమోదైంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే రూ.1.76 కోట్ల షేర్ రావడం విశేషం. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి రూ.15 లక్షలు, ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ.60 లక్షల షేర్ వచ్చినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
రెండవ రోజు కూడా ‘రాకాస’ తన బాక్సాఫీస్ రన్‌ను స్టెడీగా కొనసాగించింది. ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు ఈ చిత్రం రూ.10.30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను దాటింది. కర్ణాటక: రూ.20 లక్షలు, ఓవర్సీస్: రూ.50 లక్షలు మొత్తం మీద రెండో రోజు వరల్డ్‌వైడ్‌గా రూ.2.30 కోట్ల షేర్ వసూళ్లు నమోదయ్యాయి. రెండు రోజులకు కలిపి మొత్తం రూ.4.80 కోట్ల షేర్ వచ్చినట్లు ట్రేడ్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ప్రత్యేకంగా ఓవర్సీస్ మార్కెట్లో ‘రాకాస’ మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తోంది. ఇప్పటికే కోటి రూపాయల షేర్ మార్క్‌ను దాటిన ఈ చిత్రం, ఫైనల్‌గా రూ.2 కోట్లలోపే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా.
సోషల్ మీడియాలో ఈ సినిమా కలెక్షన్స్‌ను ఉస్తాద్ భగత్ సింగ్ తో పోలుస్తూ చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆ చిత్రంతో పోలిస్తే ‘రాకాస’ ఆ స్థాయిని చేరడం కష్టమని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మూడవ రోజు కూడా ఈ చిత్రం డీసెంట్ హోల్డ్‌ను కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బుక్‌మైషో ట్రెండ్స్ ప్రకారం ప్రతి గంటకు 3 వేలకుపైగా టికెట్లు అమ్ముడవుతున్నాయి. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రాబోయే రోజుల్లో కూడా ఇదే స్థాయి కలెక్షన్స్ కొనసాగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీకెండ్ తర్వాత కలెక్షన్స్ ఎలా ఉంటాయన్నదే కీలకం కానుంది. రాకాస చిత్రం యూత్ ఆడియన్స్ సపోర్ట్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి రన్ కొనసాగిస్తోంది. మొదటి రెండు రోజుల్లోనే పాజిటివ్ ట్రెండ్ చూపించిన ఈ సినిమా, వచ్చే రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

