Anubhavinchu Raja trailer | ‘రూపాయి పాపాయి లాంటిది..’అనుభవించు రాజా ట్రైలర్
రాజ్ తరుణ్ (Raj Tarun) నటిస్తున్న తాజా ప్రాజెక్టు అనుభవించు రాజా (Anubhavinchu Raja). తాజాగా అక్కినేని నాగార్జున ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.

టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) నటిస్తున్న తాజా ప్రాజెక్టు అనుభవించు రాజా (Anubhavinchu Raja). విలేజ్ బ్యాక్ డ్రాప్ కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీను గవిరెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చ్చింది. ఈ చిత్రంలో కశిష్ ఖాన్ (Kashish Khan) హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా అక్కినేని నాగార్జున ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘రూపాయి పాపాయి లాంటిది రా..దాన్ని పెంచి పెద్దది చేసుకోవాలి కానీ..ఎవడి చేతిలో పడితే వాడి చేతిలో పెట్టకూడదు..‘అంటూ వచ్చే సంభాషణలతో మొదలైంది ట్రైలర్. మొదట్లో రాజ్ తరుణ్ సెక్యూరిటీ గార్డుగా కనిపించి..ఆ తర్వాత విలేజ్‌లో కోడి పందాలతో సరదా లైఫ్‌ను ఎంజాయ్ చేసే వాడిగా కనిపిస్తున్నాడు. హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా కనిపిస్తుంది. ‘ వచ్చే సంవత్సరం ఇదే రోజు..ఇక్కడే జెండా ఎగరేస్తా..ప్రెసిడెంట్‌గా ‘ అంటూ చివరలో రాజ్‌తరుణ్ చెప్పే డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
రాజ్ తరుణ్ చేతికి బంగారపు ఉంగరాలు, బ్రాస్ లెట్ పెట్టుకుని స్టైలిష్ గాగుల్స్ తో పందెం రాయుడిగా అలరించబోతున్నట్టు ట్రైలర్ చెప్పేస్తుంది. సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్టర్. భాస్కర్ భట్ల పాటలు రాశారు. రాజ్ తరుణ్ దీంతోపాటు మరోవైపు స్టాండ్ అప్ రాహుల్ సినిమాలో నటిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Puneeth Rajkumar Award | దివంగత పునీత్ రాజ్‌కుమార్‌కు అరుదైన గౌరవం
Sushant Singh | ఘోర రోడ్డు ప్రమాదం.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్యామిలీలో ఐదుగురు మృతి
Biker Naatu Naatu Dance | ట్రాఫిక్ సిగ్నల్‌లో బైకర్ ‘నాటు నాటు’ డ్యాన్స్ ..వీడియో హల్చల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

