Rajinikanth | అక్టోబర్‌లో వెట్టయన్.. రజనీకాంత్ సినిమా విడుదలపై క్లారిటీ
70ప్లస్‌లోనూ విరామం లేకుండా సినిమాలు చేస్తున్నారు రజనీకాంత్. చిన్న చిన్న స్టార్‌హీరోలే ఏడాదికి ఒక సినిమాతో సరిపెడుతుంటే.. సూపర్‌స్టార్ అయ్యుండి ఏడాది లోపే రెండు సినిమాలు విడుదల చేసి, మూడో సినిమాను కూడా చకచకా కానిచ్చేస్తున్నారు తలైవా.
Rajinikanth | 70ప్లస్‌లోనూ విరామం లేకుండా సినిమాలు చేస్తున్నారు రజనీకాంత్. చిన్న చిన్న స్టార్‌హీరోలే ఏడాదికి ఒక సినిమాతో సరిపెడుతుంటే.. సూపర్‌స్టార్ అయ్యుండి ఏడాది లోపే రెండు సినిమాలు విడుదల చేసి, మూడో సినిమాను కూడా చకచకా కానిచ్చేస్తున్నారు తలైవా. గత ఏడాది ఆగస్ట్‌లో ఆయన ‘జైలర్’గా చేసిన హంగామా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న ‘లాల్ సలామ్’తో వచ్చారు. ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టయన్’ చేస్తున్నారు.
ఈ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తాజాగా ‘వెట్టయన్’ విడుదలపై క్లారిటీ ఇచ్చింది. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సరికొత్త పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. గన్ పట్టుకొని, కళ్లద్దాలతో ైస్టెలిష్‌గా రజనీకాంత్ పోస్టర్లో కనిపిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, దగ్గుబాటి రానా మంజు వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో రావురమేశ్, రోషిణి మొల్లేటి, రితికా సింగ్, దుషార విజయ్ ఇతర పాత్రధారులు. అనిరుథ్ రవిచంద్రన్ స్వరాలందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

