Rajinikanth | ఇదే చివరి సినిమా కావొచ్చు
యాభైఏండ్లుగా అలుపెరుగని సినీ ప్రయాణాన్ని సాగిస్తున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయన రిటైర్మెంట్ గురించిన వార్తలు ప్రతీ సంవత్సరం వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్' చిత్రంలో నటిస్తున్నారు.
యాభైఏండ్లుగా అలుపెరుగని సినీ ప్రయాణాన్ని సాగిస్తున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయన రిటైర్మెంట్ గురించిన వార్తలు ప్రతీ సంవత్సరం వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ చిత్రంలో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఆగస్ట్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. మరోవైపు కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ‘లాల్‌సలామ్’లో రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసింది. ఆయనకిది 170వ చిత్రం కావడం విశేషం.
ఈ రెండు చిత్రాల తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ అనంతరం రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పే అవకాశముందని తెలిసింది. ఈ విషయాన్ని ్రప్రముఖ తమిళ దర్శకుడు మిస్కిన్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. లొకేష్ కనకరాజ్‌తో చేస్తున్న 171వ చిత్రమే రజనీకాంత్‌కు అఖరి సినిమా అయ్యే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇది కేవలం మిస్కిన్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, రిటైర్మెంట్ గురించి రజనీకాంత్ సరైన సమయంలో స్పందిస్తారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

