Thalaivar Rajinikanth | డ్రగ్స్, మద్యం జోలికి వెళ్లకండి.. యువతకు రజనీకాంత్ హెచ్చరిక
Rajinikanth | డ్రగ్స్, మద్యం జోలికి వెళ్లకండంటూ యువతను హెచ్చరించాడు తమిళ అగ్ర కథానాయకుడు సూపర్ స్టార్ రజనీకాంత్.
Thalaivar Says SayNoToDrugs | డ్రగ్స్, మద్యం జోలికి వెళ్లకండంటూ యువతను హెచ్చరించాడు తమిళ అగ్ర కథానాయకుడు సూపర్ స్టార్ రజనీకాంత్. చెన్నై విమానాశ్రయంలో బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన యువతను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలంలో యువత పెడదోవ పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన రజనీ, క్రమశిక్షణ లేని జీవితం నరకప్రాయమవుతుందని హెచ్చరించారు. యువత కేవలం సినిమాల్లోని స్టంట్లు, నటుల వేషధారణ చూసి ప్రభావితమై బైక్ రేసింగ్ వంటి ప్రమాదకర పనులకు పాల్పడటం సరికాదని, అది ప్రాణాపాయానికి దారితీస్తుందని హితవు పలికారు. చదువుకోవాల్సిన వయసులో విద్యపై పూర్తి దృష్టి సారించి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ముఖ్యంగా డ్రగ్స్, ఆల్కహాల్ వంటి భయంకరమైన వ్యసనాలకు బానిసలైతే వ్యక్తిగత జీవితమే కాకుండా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల జీవితాలు కూడా చిన్నాభిన్నమైపోతాయని భావోద్వేగంగా మాట్లాడారు. చెడు అలవాట్లు ఉన్న స్నేహితులకు వీలైనంత దూరంగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ప్రాథమిక కర్తవ్యమని గుర్తుచేశారు.
ఇదే క్రమంలో తన తదుపరి సినిమాలపై స్పందిస్తూ, భారీ అంచనాలున్న ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని వెల్లడించారు. అలాగే కమల్ హాసన్ నిర్మాణంలో, సిబి చక్రవర్తి దర్శకత్వంలో రాబోతున్న ‘తలైవర్ 173’ ప్రాజెక్ట్ గురించిన విశేషాలను కూడా పంచుకుంటూ, తన పనిని తాను నిబద్ధతతో కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. యువత కేవలం సినిమాలను వినోదంగా మాత్రమే చూడాలని, నిజ జీవితంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని రజనీకాంత్ ఈ సందర్భంగా పిలుపునిచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

