Rajinikanth: పెద్దన్న దర్శకుడికి రజనీకాంత్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చారా..!

ఈ మధ్య కాలంలో హీరోలు తమ దర్శకులకి సర్ప్రైజింగ్ గిఫ్ట్‌లు ఇచ్చి ఆశ్చర్యపరుస్తున్నారు. సక్సెస్‌లు లేని సమయంలో భారీ హిట్ అందించిన ఆనందంలో కాస్ట్ లీ కార్లు లేదంటే బంగ్లాలు గిఫ్ట్‌లుగా అందిస్తున్నారు. తాజగా సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నాత్తె చిత్ర దర్శకుడు శివని ఇంటికి పిలిచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ అందించారట. ఈ గిఫ్ట్ చూసి దర్శకుడి మైండ్ బ్లాక్ అయిందని అంటున్నారు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మాస్ డైరెక్టర్ శివ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘అన్నాత్తై’. తెలుగులో ‘పెద్దన్న’ గా విడుదలైంది. ఈ చిత్రంలో రజనీ కాంత్ సరసన నయనతార హీరోయిన్గా నటించగా కీర్తి సురేశ్ రజనీ సోదరి పాత్రలో సందడి చేసింది. ఖుష్బూ, మీనా, జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్ తెలుగులో పెద్ద హిట్ కాకపోయిన తమిళంలో మంచి వసూళ్లు రాబట్టింది.
కొన్ని రోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో కూడా విడుదలైన అన్నాత్తె సినిమా అక్కడ కూడా ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ క్రమంలో హ్యాపీగా ఫీలైన రజనీకాంత్.. శివతో పాటు ఆయన ఇంటి సభ్యులను తన ఇంటికి పిలిపించుకున్నాడట. మూడు గంటలపాటు వారితో ముచ్చటించాక గోల్డ్ చెయిన్‌ను బహుమతిగా అందజేశారట. దీంతో శివ కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగితేలుతున్నారు. కాగా రజనీకాంత్- శివ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందని కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
రకుల్ ప్రీత్ అందాల విందు.. బ్లూ శారీలో స్టన్నింగ్ లుక్‌తో కట్టిపడేస్తోందిగా!
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

