గత ఏడాది ‘అన్నాత్తె’ (తెలుగులో ‘పెద్దన్న’) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ప్రస్తుతం ఆయన నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా రజనీకాంత్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌లో రెండు చిత్రాలను అంగీకరించారు. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన పూజా కార్యక్రమాల్ని నవంబర్ 5 నిర్వహించబోతున్నామని లైకా ప్రొడక్షన్స్ అధినేత తమిళ్‌కుమరన్ తెలిపారు. ఈ సినిమాలకు సంబం ధించిన దర్శకులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తామని లైకా ప్రొడక్షన్స్ ఛైర్మన్ సుభాస్కరన్ తెలిపారు. గతంలో ఇదే నిర్మాణ సంస్థలో రజనీకాంత్ ‘2.ఓ’ చిత్రంలో నటించారు. రజనీకాంత్ తాజా చిత్రం ‘జైలర్’ చిత్రీకరణ జరుపుకుంటున్నది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకురానుంది.