Rajinikanth | రజనీకాంత్ కొత్త చిత్రంపై బిగ్ అప్డేట్!
Rajinikanth Next Film | సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడేమో. ఏడు పదుల వయసు దాటినా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. ఏడాదికి ఒక సినిమాను విడుదల చేస్తూ అభిమానులను ఖుషి చేస్తుంటాడు. అయితే ప్రస్తుతం ఈయన హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. 2010లో వచ్చిన ‘రోబో’ తర్వాత ఇప్పటివరకు రజనీ కెరీర్లో ఆ స్థాయి హిట్ రాలేదు. మధ్యలో ‘కబాలీ’, ‘2.0’ చిత్రాలు మంచి హైప్‌తో వచ్చినా ప్రేక్షకులను మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే 2019లో వచ్చిన ‘పేట’ మాత్రం రజినీకాంత్ అభిమానులను ఎంటర్టైన్ చేసింది.
గతేడాది విడుదలైన ‘పెద్దన్న’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రజినీ అభిమానులను కూడా ఆకట్టుకోలేకపోయింది. దాంతో తలైవా అభిమానులు ప్రస్తుతం ఆయన తరువాతి చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ‘డాక్టర్’, ‘బీస్ట్’ చిత్రాల దర్శకుడు నెల్సన్ కుమార్‌తో తదుపరి సినిమాను చేయనున్నట్లు ప్రకటించాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధిమారన్ నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ చిత్రం ఆగస్టులో షూటింగ్ ప్రారంభించనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ‘బీస్ట్’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత నెలన్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

