Lal Salaam Movie | లాల్ సలాం మూవీ బిగ్ అప్డేట్.. తలైవా అభిమానులకు పండగే..!
Lal Salaam Movie latest Update | ధనుష్ హీరోగా నటించిన '3' సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టింది రజనీకాంత్ కూతురు ఐశ్వర్య. తొలి సినిమాకే బోలెడంత ప్రశంసలు అందుకుంది. ఐశ్వర్య టేకింగ్, కథను తీసుకెళ్లిన విధానం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.
Lal Salaam Movie latest Update | ధనుష్ హీరోగా నటించిన ‘3’ సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టింది రజనీకాంత్ కూతురు ఐశ్వర్య. తొలి సినిమాకే బోలెడంత ప్రశంసలు అందుకుంది. ఐశ్వర్య టేకింగ్, కథను తీసుకెళ్లిన విధానం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఇప్పటికీ చాలా మందికి ఈ మూవీ అంటే ఫైవరేట్. ఇక ఆ తర్వాత ‘వాయ్ రాజా వాయ్’ అనే కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌ను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ విజయాన్నందుకుంది. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకోని ఓ డాక్యుమెంటరీ ఫిలింను తెరకెక్కించింది. కానీ అది అంతగా వర్కవుట్ కాలేదు. దాంతో ఏడేళ్లు గ్యాప్ తీసుకొని ‘లాల్ సలాం’ సినిమాతో మళ్లీ మెగాఫోన్ పట్టింది.
విష్ణు విశాల్, విక్రాంత్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై ఎక్కడలేని బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీ ఓ కీలకపాత్రలో మెరవనున్నాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా రజనీకాంత్‌కు సంబంధించిన బిగ్ అప్డేట్ను మేకర్స్ రిలీజ్ చేశారు. రజనీకాంత్ ఈ సినిమా షూటింగ్ కోసం సోమవారం ముంబై రానున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఆయన లుక్‌ను, ఆయన పాత్ర పేరును రేపు రివీల్ చేస్తున్నట్లు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో రజనీకి ఓ చెల్లెలు కూడా ఉందని సమాచారం. ఇక ఆ పాత్రలో జీవిత రాజశేఖర్ నటించబోతున్నట్లు టాక్. ఏ.ఆర్ రెహమాస్ స్వరాలందిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఇదే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఐశ్వర్య దీనితో పాటుగా ఐశ్వర్య ‘ఓ సాతి చల్’ అనే హిందీ సినిమాను కూడా తెరకెక్కిస్తుంది.
THE MAN ..THE MANIDHAN…THE POWER MAGNET ARRIVES MIDNIGHT… #Thalaivar #Appa ❤️ # lalsalaam pic.twitter.com/hX445p0ZLa
— Aishwarya Rajinikanth (@ash_rajinikanth) May 7, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

