Lal Salaam | ఫిబ్రవరిలో లాల్ సలామ్.. లెజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్ అతిథి పాత్ర
సూపర్‌స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లాల్ సలామ్'. ఈ సినిమాలో లెజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్ అతిథి పాత్రను పోషించారు. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు.
Lal Salaam | సూపర్‌స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లాల్ సలామ్’. ఈ సినిమాలో లెజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్ అతిథి పాత్రను పోషించారు. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. ఐశ్వర రజనీకాంత్ దర్శకురాలు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు.
ముంబయి నేపథ్యంలో క్రికెట్ ప్రధానంగా నడిచే ఈ కథలో మొయినుద్దీన్ భాయ్‌గా శక్తివంతమైన పాత్రలో రజనీకాంత్ కనిపించబోతున్నారు. భిన్న మతాలకు చెందిన ఇద్దరు మిత్రులకు క్రికెట్ అంటే ప్రాణం. అయితే మతం పేరుతో గొడవల వల్ల వారు ఆటకు దూరమయ్యే పరిస్థితి వస్తుంది.
ఈ నేపథ్యంలో మొయినుద్దీన్ భాయ్ వారి మధ్య ఉన్న విద్వేషాలను ఎలా తొలగించాడు? ఇరు వర్గాలు సఖ్యతతో జీవించేందుకు ఏం చేశాడన్నదే ఈ సినిమా కథాంశమని దర్శకుడు తెలిపారు. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్లో సూపర్‌స్టార్ రజనీకాంత్, క్రికెట్ లెజెండ్ కపిల్‌దేవ్ చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విష్ణు రంగస్వామి, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, నిర్మాత: సుభాస్కరన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఐశ్వర్య రజనీకాంత్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

