Rajinikanth | బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు – రజనీకాంత్‌కు గోవాలో ఘన సన్మానం
Rajinikanth | ఒకప్పుడు సాధారణ బస్ కండక్టర్‌గా జీవితం ప్రారంభించిన శివాజీరావ్ గైక్వాడ్ ఈ రోజు భారతీయ సినిమా చరిత్రలో సూపర్ స్టార్‌గా నిలిచాడు. గాల్లో సిగరెట్ తిప్పినా, చొక్కా కాలర్ తిప్పినా, చేతిని మడత పెట్టినా ప్రతీ హావభావం ఒక స్టైల్ గా మారిపోయింది
Rajinikanth | ఒకప్పుడు సాధారణ బస్ కండక్టర్‌గా జీవితం ప్రారంభించిన శివాజీరావ్ గైక్వాడ్ ఈ రోజు భారతీయ సినిమా చరిత్రలో సూపర్ స్టార్‌గా నిలిచాడు. గాల్లో సిగరెట్ తిప్పినా, చొక్కా కాలర్ తిప్పినా, చేతిని మడత పెట్టినా ప్రతీ హావభావం ఒక స్టైల్ గా మారిపోయింది. ఆయనలో ఉన్న ఆ మ్యాజిక్ మిలియన్ల మందిని ఆకట్టుకుంది. అప్పట్లో ఎవరికీ ఊహకందని ఈ ప్రయాణం ఇప్పుడు ఒక గాథగా మారింది. భారతీయ చలనచిత్ర రంగానికి రజనీకాంత్ అందించిన విశిష్టమైన సేవలను గుర్తించి, 55వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం (IFFI) వేదికపై ఆయనను ఘనంగా సన్మానించనున్నారు. నవంబర్ 20న గోవాలో ఈ ప్రతిష్ఠాత్మక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
రజనీకాంత్ సినీ ప్రస్థానం ఐదు దశాబ్ధాలు దాటింది. 70 ఏళ్ల వయసులో కూడా 500 కోట్ల క్లబ్లో చేరే సినిమాలతో దూసుకెళ్తున్న ఆయన సత్తా సూపర్ స్టార్ అనే బిరుదుకే న్యాయం చేస్తోంది. ఈ సందర్భంగా IFFI ముగింపు వేడుకలో ఆయనకు ప్రత్యేక సత్కారం ఏర్పాటు చేశారు. ఇదే వేదికపై భారత సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానుభావులు ..గురుదత్, రాజ్ ఖోస్లా, రిత్విక్ ఘటక్, పి.భానుమతి, భూపేన్ హజారికా, సలీల్ చౌదరి వంటి వారిని శతజయంతి సందర్భంగా స్మరించనున్నారు. ఈ సారి గోవా ఉత్సవం భారతీయ సినీరంగానికి ఒక పెద్ద వేదికగా మారనుంది. మొత్తం 81 దేశాల నుండి 240కు పైగా సినిమాలు ప్రదర్శించబడతాయి. అంతేకాదు, ఈసారి 50 మందికి పైగా మహిళా దర్శకులు తమ చిత్రాలను ప్రదర్శించడం విశేషం.
విధు వినోద్ చోప్రా, ఆమీర్ ఖాన్, అనుపమ్ ఖేర్, రవివర్మన్, సుహాసిని మణిరత్నం, శ్రీకర్ ప్రసాద్ వంటి ప్రముఖులు 21 మాస్టర్ క్లాసులు నిర్వహించనున్నారు. డిజిటల్ యుగంలో ఎడిటింగ్, నటన, సినిమా సాంకేతికతలపై చర్చలు జరగనున్నాయి. ఈ ఉత్సవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం, సినిమా మరియు టెక్నాలజీ మధ్య పెరుగుతున్న అనుబంధం, హ్యాకథాన్ వంటి ఆధునిక అంశాలపై కూడా విస్తృత చర్చలు జరగనున్నాయి. ఇలాంటి అంతర్జాతీయ వేదికపై రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రయాణానికి గౌరవం లభించడం ఆయన అభిమానులకు పండగ వంటిది. ఒక బస్ కండక్టర్ నుంచి ప్రపంచ సినీరంగంలో సూపర్ స్టార్‌గా ఎదిగిన ఈ లెజెండ్ గౌరవించబడటం భారతీయ సినిమాకే గర్వకారణం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

