Karthik Subbaraj | పేట దర్శకుడితో మళ్లీ చేతులు కలుపనున్న రజినీకాంత్.?
Superstar Rajinikanth | గతేడాది ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’ (Jigarthanda Double X) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు తమిళ స్టార్ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్. రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది.
Superstar Rajinikanth | గతేడాది ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’ (Jigarthanda Double X) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు తమిళ స్టార్ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్. రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా అనంతరం కార్తిక్ సుబ్బరాజ్ తమిళ స్టార్ నటుడు సూర్యతో ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అనంతరం సూపర్‌స్టార్ రజినీ కాంత్‌తో సినిమా చేయబోతున్నాడు కార్తీక్. తాజాగా ఇదే విషయంపై ఇక ఇంటర్వ్యూలో స్పందించాడు.
రజినీకాంత్ తో సినిమా అంటూ వస్తున్నా వార్తలపై కార్తీక్ స్పందిస్తూ.. తలైవాకు ఇప్పటికే చాలా కథలు చెప్పాను. కానీ ఏ స్టోరీ అతనికి సెట్ అవ్వట్లేదు. ప్రస్తుతం సూపర్‌స్టార్ వరుస సినిమాలను లైన్లో ఉంచాడు. ఈ సినిమాలు కంప్లీట్ అయ్యేవరకు చాలా సమయం పడుతుంది. ఈలోపు సూపర్ స్టార్ తనను సినిమా కోసం పిలిస్తే, తప్పకుండా అతనితో మరో సినిమా చేస్తానని కార్తిక్ సుబ్బరాజ్ వెల్లడించాడు.
రజినీకాంత్, కార్తిక్ సుబ్బరాజ్ కాంబోలో ఇంతకుముందు పేట అనే మూవీ వచ్చింది. హాస్టల్లో ర్యాగింగ్‌ను అంతమొందించడానికి కాళీ అనే వార్డెన్‌గా వచ్చిన రజినీ అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోన్నాడు. అసలు కాళి యొక్క గతం ఏంటి అనేది ఈ మూవీ స్టోరీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

