Rajendra Prasad | మళ్లీ నోరు జారిన నటకిరీటి రాజేంద్రప్రసాద్: నెట్టింట్లో తీవ్ర విమర్శలు!
Rajendra Prasad | ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన నోటికి పని చెప్పాడు. ఆయన కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం 'సఃకుటుంబానాం'.
Rajendra Prasad | ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన నోటికి పని చెప్పాడు. ఆయన కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సఃకుటుంబానాం’. రామ్ కిరణ్, మేఘ ఆకాశ్ జంటగా ఉదయ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఇటీవల నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో నటకిరీటి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు మరోసారి పెద్ద వివాదానికి దారి తీశాయి.
ట్రైలర్ విడుదల అనంతరం వేదికపై మాట్లాడేందుకు మైక్ అందుకున్న రాజేంద్రప్రసాద్, అంతకుముందు మాట్లాడిన హాస్య నటుడు డాక్టర్ బ్రహ్మానందం గురించి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా మారాయి.
రాజేంద్రప్రసాద్: డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడటం సబవు కాదు…
బ్రహ్మానందం: మేము కూడా మీ శిష్యులమే కదా!
రాజేంద్రప్రసాద్: ముసలి ** కొడుకుని కదా నువ్వు…
బ్రహ్మానందం (ఆశ్చర్యంగా): ఎవరూ..?
రాజేంద్రప్రసాద్: నేను.. అంటూ సర్దిచెప్పుకున్నారు.
ప్రస్తుతం ఈ సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ వేదికలపై తరచూ పరుష పదాలు వాడటం లేదా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం మామూలైపోయిందంటూ విమర్శిస్తున్నారు. అంతటి సీనియర్ నటుడిని, గౌరవనీయులైన బ్రహ్మానందాన్ని ఉద్దేశించి అలాంటి భాష వాడటం ఏమాత్రం సరికాదు అని కొందరు కామెంట్లు చేశారు. మరికొందరు ప్రతి ఈవెంట్‌కు వచ్చి రాజేంద్రప్రసాద్ పరువు తీస్తున్నారు, ఎందుకు ఈవెంట్లలో ఆయనను పిలిచి మరింత ఇబ్బంది పడుతున్నారంటూ సినీ బృందాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆయన ఈవెంట్లలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం ఇది మొదటిసారి కాదు. సీనియర్ నటుడిగా, పరిశ్రమకు మార్గదర్శిగా ఉండాల్సిన వ్యక్తి ఇలాంటి పదజాలం వాడటం ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తోందని నెటిజన్లు ఘాటుగా విమర్శిస్తున్నారు.
మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్..
డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడటం సబవు కాదు..
బ్రహ్మి: మేము కూడా మీ శిష్యులమే కదా
ముసలి ముండా కొడుకుని కదా నువ్వు…
బ్రహ్మి: ఎవరూ..?
నేను.. – రాజేంద్రప్రసాద్
— cinee worldd (@Cinee_Worldd) November 29, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

