Rajendra Prasad | పిల్లలు చూడగలిగిన పెళ్లి.. షష్టిపూర్తి: రాజేంద్రప్రసాద్
‘తల్లిదండ్రుల పెళ్లి చూసే అవకాశం బిడ్డలకు ఉండదు. కానీ పిల్లలు చూడగలిగిన పెళ్లి ఏదైనా ఉందంటే అది షష్టిపూర్తి ఒక్కటే. ప్రతి మనిషికి షష్టిపూర్తి చాలా ముఖ్యం’ అన్నారు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్. ఆయన ప్రధాన పాత్రలో అర్చనతో కలిసి నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’.
Rajendra Prasad | ‘తల్లిదండ్రుల పెళ్లి చూసే అవకాశం బిడ్డలకు ఉండదు. కానీ పిల్లలు చూడగలిగిన పెళ్లి ఏదైనా ఉందంటే అది షష్టిపూర్తి ఒక్కటే. ప్రతి మనిషికి షష్టిపూర్తి చాలా ముఖ్యం’ అన్నారు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్. ఆయన ప్రధాన పాత్రలో అర్చనతో కలిసి నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. రూపేష్, ఆకాంక్షసింగ్ జంటగా నటించారు. పవన్‌ప్రభ దర్శకుడు. రూపేష్ చౌదరి నిర్మాత. బుధవారం చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..
‘తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆవిష్కరించే గొప్ప కథ ఇది. మన ఇంటిలో ఏం ఉంటే సంతోషంగా ఉంటామనే అంశాలను ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. అందరూ కుటుంబ సమేతంగా చూసి ఆనందించే సినిమా’ అన్నారు. చాలా కాలం విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడం ఆనందంగా ఉందని, ఇళయరాజా, తోట తరణి వంటి లెజెండ్స్ పనిచేయడం ఈ సినిమా స్థాయి ఏమిటో చెబుతుందని అర్చన అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘మంచి విలువలతో ఈ సినిమాను తెరకెక్కించాం. ఇళయరాజాగారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో కలిసి పనిచేయడంతో నిజంగా నా జన్మ ధన్యమైంది’ అన్నారు. చక్కటి కుటుంబ కథతో హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉందని రూపేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

