రుత్విక్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘రాజా ది రాజా’. అనిల్ బోయిడపు దర్శకుడు. కె.నిహారిక దాసరి నిర్మాత. బుధవారం ఈ చిత్ర టీజర్‌ను అగ్ర దర్శకుడు నాగ్అశ్విన్ ఆవిష్కరించారు. తండ్రీకొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ టీజర్ సాగింది.
యువత తమ కలల కోసం పరుగులు తీయడం, తల్లిదండ్రులు తమ ఆశయాలను పిల్లలపై రుద్దడం వంటి నేటి తరానికి కనెక్ట్ అయ్యే అంశాలను చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కించామని, చక్కటి ప్రేమకథతో ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు.
నేటి ట్రెండ్‌కు తగిన కథ ఇదని, యువతరాన్ని మెప్పిస్తుందని నిర్మాత పేర్కొన్నారు. విశాఖ ధీమాన్, సాయికుమార్, వీకే నరేష్, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె రాబిన్, నిర్మాణ సంస్థ: వృందావన్ క్రియేషన్స్, దర్శకత్వం: అనిల్ బోయిడపు.