సినీ నటుడు రాహుల్ రామకృష్ణ డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సులో అడ్మిషన్ తీసుకున్నారు. గురువారం ఆయన యూనివర్సిటీకి విచ్చేసి వైస్ ఛాన్స్లర్ ప్రొ॥ ఘంటా చక్రపాణిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ రామకృష్ణను అభినందించిన వైస్ ఛాన్స్లర్ ఆయనకు బీ.ఏ కోర్సు పుస్తకాలను అందించారు.
ఉన్నత విద్యను పూర్తి చేయలేక పోయిన వారికి, ఆర్థికపరమైన ఇబ్బందులతో విద్యాభ్యాసం కొనసాగించలేని వారికి, గృహిణులకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓ వరమని రాహుల్ రామకృష్ణ పేర్కొన్నారు. తాను ఇంజనీరింగ్ చదువును మధ్యలో ఆపేశానని, అందుకే డిగ్రీ పూర్తిచేసేందుకు అంబేద్కర్ యూనివర్సిటీలో చేరానని ఆయన తెలిపారు.