రఘు కుంచె ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మా నాన్న నక్సలైట్’. అజయ్, సుబ్బరాజు, జీవ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో అనురాధ ఫిలింస్ డివిజన్ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. 90వ దశకపు నేపథ్యంతో సాగే కథతో దర్శకుడు పి సునీల్ కుమార్ రెడ్డి రూపొందిస్తున్నారు.
త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. నిర్మాత మాట్లాడుతూ…‘నక్సలైట్ నేపథ్యంతో సాగే చిత్రమిది. నక్సల్ నాయకుడిగా రఘు కుంచె కనిపిస్తారు. తండ్రీ కొడుకుల మధ్య భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి’ అన్నారు. ఎల్బీ శ్రీరామ్, కృష్ణ బూరుగుల, రేఖ నిరోషా ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఎస్వీ శివరామ్.