మూడుతరాల అభిమానాన్ని పొందడం పూర్వజన్మ సుకృతం
‘జనాభిమానానికి మించిన సంపద, తద్వారా వచ్చే సంతోషం ఈ రెండింటినీ వెలకట్టలేం. ఆ ఆనందాన్ని నేను చాలాసార్లు అనుభవించాను.
‘జనాభిమానానికి మించిన సంపద, తద్వారా వచ్చే సంతోషం ఈ రెండింటినీ వెలకట్టలేం. ఆ ఆనందాన్ని నేను చాలాసార్లు అనుభవించాను. సుదీర్ఘమైన నా నట ప్రయాణంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించే అదృష్టం నాకు కలిగింది. మూడు తరాల అభిమాన పాత్రుడ్ని అవ్వడం నిజంగా నా పూర్వజన్మసుకృతం’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు.
ఆయన కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భగవంత్ కేసరి’. శ్రీలీల, కాజల్ కీలక పాత్రధారులు. ఇటీవల విడుదలై ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ బాక్సాఫీస్ కాషేర్ సెలబ్రేషన్‌ని నిర్వహించారు. సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఈ వేడుకకు అతిథిగా హాజరయ్యారు. బాలకృష్ణ ఇంకా మాట్లాడుతూ ‘ ప్రయోగాత్మక చిత్రాలనూ, వైవిధ్యభరితమైన పాత్రలనూ ప్రజలు తప్పక ఆదరిస్తారని నాన్నగారు అంటుండేవారు. ‘భగవంత్‌కేసరి’ ఆయన మాటను నిజం చేసింది.
అందరం కష్టపడి ఇష్టంతో చేసిన సినిమా ‘భగవంత్‌కేసరి’. త్వరలో ఈ సినిమా హిందీలో రాబోతున్నది. తొలిసారి హిందీలో డబ్బింగ్ చెప్పాను. హిందీపై తెలుగువారికివున్న భాషా పటిమ, సత్తా ఏంటో ఈ సినిమా నిరూపిస్తుంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను. అందులో బ్లడ్ బాత్ బ్రాండ్ ఎలా ఉండబోతుందో చూస్తారు. ఇలాగే మంచి సినిమాలు చేస్తూ, ఓవైపు బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా, మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా నావంతు సేవలను అందిస్తూ ముందుకు సాగే అవకాశం ఆ భగవంతుడు నాకివ్వాలని, అలాగే జనమంతా బావుండాలని కోరుకుంటున్నా’ అని ఆకాంక్షించారు. నా కెరీర్లోనే విభిన్నమైన సినిమా ‘భగవంత్‌కేసరి’.
నాకెన్నో మధురమైన జ్ఞాపకాలిచ్చిన సినిమా ఇది. మళ్లీ బాలయ్యతో మరొక సినిమా చేయాలనుంది’ అని అనిల్ రావిపూడి అన్నారు. సినిమా విజయం పట్ల చిత్ర యూనిట్‌ని కె.రాఘవేంద్రరావు అభినందించారు. ఇంకా శ్రీలీలతోపాటు యూనిట్ సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

