నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రుద్రుడు’. ‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్ ఈజ్ క్రియేటడ్’ అనేది ఈ చిత్రం ఉపశీర్షిక. కతిరేసన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్‌సింగిల్ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో రాఘవ లారెన్స్‌ను సరికొత్త అవతారంలో చూడబోతున్నారు.
వీర తిరుమగన్ చిత్రంలోని ‘పాడాద పాటెలం’పాట క్లాసిక్హిట్గా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాందించుకుంది. ఇప్పుడు ఈ చిత్రంలో ఆ సాంగ్‌ను మరిన్ని హంగులతో ఫుట్‌ట్యాపింగ్ రీమిక్స్‌గా ఈ చిత్రంలో చూపించబోతున్నాం. ఏప్రిల్ 14న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అన్నారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శరత్‌కుమార్ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్.