కోలీవుడ్ స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవా లారెన్స్ (Raghava Lawrence) టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం రుధ్రన్. కథిరేశన్ (Kathiresan) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తెలుగులో రుద్రుడు (Rudhrudu) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీ అప్డేట్ బయటకు వచ్చింది.
రాఘవా లారెన్స్ టీం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ.. విడుదల తేదీని ప్రకటించింది. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ లాంఛ్ చేసిన కొత్త పోస్టర్ గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. రుద్రుడు ఈ ఏడాది ఏప్రిల్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన రుద్రుడు ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తోంది.
స్టార్ యాక్టర్ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. రుద్రుడు ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ బ్యానర్లో తెరకెక్కుతోంది. రాఘవా లారెన్స్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న జిగర్తాండ 2లో నటిస్తున్నాడు. పి వాసు డైరెక్షన్లో చంద్రముఖి 2 కూడా చేస్తున్నాడు.
రుద్రుడు విడుదల అప్డేట్..
Team #Rudhrudu Wishes @offl_Lawrence Master a happy birthday! ❤️
Surprise Glimpse releasing Today @ 5 PM!🔥#ருத்ரன் #రుద్రుడు #ನಮ್ಮರುದ್ರ #രുദ്രൻ#HBDRaghavaLawrenceMaster@5starcreationss @kathiresan_offl @realsarathkumar @gvprakash @priya_Bshankar @RDRajasekar @editoranthony pic.twitter.com/fXxyzEzASD
— Sreedhar Sri (@SreedharSri4u) October 29, 2022