Raghava Lawrence | మీ ఆశీస్సులు కావాలి.. చిన్నారులతో రాఘవా లారెన్స్ సెల్ఫీ వైరల్
Raghava Lawrence | తన కష్టార్జితాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంటాడు రాఘవా లారెన్స్ (Raghava Lawrence) . తాజాగా రాఘవా లారెన్స్ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు.
Raghava Lawrence | కోలీవుడ్ స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవా లారెన్స్ (Raghava Lawrence) ఓ వైపు సినిమాలతో వినోదాన్ని అందించడమే కాదు.. మరోవైపు సామాజిక సేవలో కూడా తన వంతు పాత్ర పోషిస్తుంటాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన కష్టార్జితాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంటాడు. తాజాగా రాఘవా లారెన్స్ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ తాజాగా 150 మంది చిన్నారులను దత్తత తీసుకున్నాడు. కొత్త వెంచర్ ద్వారా వారికి ఉత్తమ విద్యనందించబోతున్నాడు.
రుద్రుడు ఆడియో లాంఛ్ ఈవెంట్ సందర్భంగా దత్తత తీసుకున్న చిన్నారులతో కలిసి సెల్ఫీ దిగాడు రాఘవా లారెన్స్ . చిన్నారులను దత్తత తీసుకున్న వార్తను మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ఆశీస్సులు కావాలంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు చూసేందుకు రాఘవా లారెన్స్ గొప్ప మనసుతో తీసుకున్న నిర్ణయానికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు.
లారెన్స్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం రుధ్రన్. కథిరేశన్ (Kathiresan) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తెలుగులో రుద్రుడు (Rudhrudu) టైటిల్‌తో విడుదల కానుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన రుద్రుడు ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.
రుద్రుడులో కోలీవుడ్ భామ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తోండగా..స్టార్ యాక్టర్ శరత్ కుమార్ నెగెటివ్ రోల్లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. రుద్రుడు ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ బ్యానర్లో వస్తోంది. రాఘవా లారెన్స్ మరోవైపు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో జిగర్తాండ 2, పి వాసు డైరెక్షన్లో చంద్రముఖి 2 సినిమాలు కూడా చేస్తున్నాడు.
చిన్నారులతో రాఘవా లారెన్స్ సెల్ఫీ..
I’m extremely happy to share the news of adopting 150 children and provide them with education as a new venture from rudhran audio launch. I need all your blessings #Serviceisgod 🙏🏼 pic.twitter.com/lSwns10Grs
— Raghava Lawrence (@offl_Lawrence) April 11, 2023
రుద్రుడు ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

