‘పలాస’ ఫేమ్ రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. సంగీర్తన విపిన్ నాయిక. వెంకట్ సత్య దర్శకుడు. ధ్యాన్ అట్లూరి నిర్మాత. ఈ చిత్రంలో జీవితగా సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ కనిపించనున్నారు. ఈ పాత్రకు సంబంధించిన క్యారెక్టర్ లుక్ పోస్టర్‌ను ఇటీవల రాధికా విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘న్యూ ఏజ్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. రాధికా పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి’ అన్నారు. చరణ్‌రాజ్, కాంచి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీపాల్ చొళ్లేటి.