Radhe Shyam Collections | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. మూడేళ్ళ తర్వాత ప్రభాస్‌ను చూసేందుకు అభిమానులతో పాటు ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు. కానీ రాధాకృష్ణ, అభిమానుల నిరీక్షణకు తీవ్ర నిరాశను మిగిల్చాడు. ఈ చిత్రం మొదటి షో నుంచే నెగిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. పూజాహెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్, యూవీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఈ చిత్రానికి వచ్చిన మొదటి రోజు కలెక్షన్లను ఒక సారి గమనిస్తే
నైజాం : 10.80 కోట్లు
సీడెడ్ : 3.50 కోట్లు
ఉత్తరాంధ్ర : 1.95 కోట్లు
ఈస్ట్ : 2.60 కోట్లు
వెస్ట్ : 2.01 కోట్లు
గుంటూరు : 2.60 కోట్లు
కృష్ణ : 0.95 కోట్లు
నెల్లూరు : 1.08 కోట్లు
ఏపి+తెలంగాణ : 25.49 కోట్లు(37 కోట్ల గ్రాస్)
ఓవర్సీస్ : 6.75 కోట్లు
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా : 3.80 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 38.37 కోట్లు (67 కోట్ల గ్రాస్)
‘రాధేశ్యామ్’ చిత్రానికి మొదటి నుంచే ప్రేక్షకలలో భారీ అంచనాలను నమోదు చేశాయి. ప్రభాస్ గత చిత్రాలు సాహో, బాహుబలి-2 రెండు చిత్రాలు మొదటి రోజు 100కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి రికార్డు సృష్టించాడు. రాధేశ్యామ్ చిత్రం కూడా 100కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి హ్యాట్రిక్‌ను సాధిస్తుంది అని అందరూ ఊహించారు. కానీ అంచనాలకు భిన్నంగా ఈ చిత్రం కేవలం 67కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. పిరీయాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ హాస్త సాముద్రికా నిపుణుడిగా నటించాడు.