Raaka | అల్లు అర్జున్ ‘రాకా’లో ఛాన్స్ మిస్ చేసుకున్న బ్లాస్ట్ బ్యూటీ.. అసలు కారణం చెప్పిన అట్లీ!
Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణె కథానాయికగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రాకా’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అత్యాధునిక సాంకేతికత, భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచింది.
Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణె కథానాయికగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రాకా’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అత్యాధునిక సాంకేతికత, భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తాజాగా దర్శకుడు అట్లీ చేసిన ఓ ఆసక్తికర వ్యాఖ్య ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ‘రాకా’లో ఒక కీలక పాత్ర కోసం యువ నటి ప్రీతీ ముకుందన్‌ను సంప్రదించినప్పటికీ, ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా ఆ అవకాశం దక్కలేదని అట్లీ స్వయంగా వెల్లడించారు.
ప్రీతీ ముకుందన్ ఇటీవల విడుదలైన ‘బ్లాస్ట్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందంతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకుని ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అంతకుముందు తెలుగు చిత్రం ‘కన్నప్ప’ లో కనిపించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ‘బ్లాస్ట్’ విజయానంతరం ఆమెకు వరుసగా పలు భాషల్లో అవకాశాలు వస్తుండటంతో ప్రస్తుతం ప్రీతీ బిజీ హీరోయిన్గా మారిపోయారు. తాజాగా జరిగిన ‘ఇదయం మురళీ’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన అట్లీ.. ‘రాకా’కు సంబంధించిన ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ప్రీతీ ముకుందన్‌ను ‘రాకా’లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం సంప్రదించామని, అయితే అప్పటికే ఆమెకు వరుస సినిమా కమిట్మెంట్లు ఉండటంతో డేట్లు కుదరక ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయారని చెప్పారు.
ప్రీతీ ముకుందన్ చేయాల్సిన పాత్రను చివరకు నటి ఫెమినా జార్జ్‌కు అప్పగించినట్లు అట్లీ వెల్లడించారు. దీంతో ‘రాకా’లో ఫెమినా ఏ తరహా పాత్రలో కనిపించబోతుందనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా కావడంతో ‘రాకా’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. భారీ విజువల్స్, హై వోల్టేజ్ యాక్షన్, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్‌కు జోడీగా దీపికా పదుకోణె నటిస్తుండటం కూడా ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- atlee
- first look
- kaarthi
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

